రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు జన్మదిన శుభాకాంక్షలువ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం

*రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు* *వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం*

*జమ్మికుంట మే 8 ప్రశ్న ఆయుధం*

IMG 20250508 WA2679

రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు పురస్కరించుకొని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం గురువారం రోజున కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం తన సహచర మార్కెట్ డైరెక్టర్లు అర్థిదారుల సమక్షంలో కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున పండ్లు పంపిణీ చేశారు అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం మాట్లాడుతూ రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘం నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్.ఎస్.యూ ఐ రాష్ట్ర అధ్యక్షునిగా, మార్కెట్ చైర్మన్ గా కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా గెలుపొందిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే దాడి జరిగినప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు మంత్రి పొన్నం రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎగ్గెటి సదానందం కందాల తిరుపతి దొడ్డి శ్యాం కుమార్ జమ్మికుంట అత్తిదారుల సంఘం దాడువాయిల సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబాల రాజు ఆర్తి ట్రేడర్స్ దాడువాయిలు హమాలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment