రుచిలో చేదు….ఆరోగ్యానికి మేలు..!

ఆరోగ్యానికి
Headlines :
  1. ఆరోగ్యానికి చేదు రుచితో మేలు చేసే కాకరకాయ
  2. కాకరకాయతో బ్లడ్ షుగర్ కంట్రోల్ – డయాబెటిస్ పేషెంట్లకు అద్భుత ప్రయోజనాలు
  3. చర్మ ఆరోగ్యానికి, ఇమ్యూనిటీ పెంచడానికి కాకరకాయ

కాకరకాయ.. రుచికి చేదుగా ఉంటుంది కానీ ఈ కూరగా యలో అద్భుత పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. ఆహారంలో భాగంగా తీసుకోవడంవల్ల ఆరోగ్యా నికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. అంతేకా కుండా రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగు పరచడం ద్వారా ఇది ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది.

* కాకర కాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఎ, సి, 3 విటమిన్లు ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు, డైటరీ ఫైబర్లకు ఇది మంచి మూలం. కాబట్టి జీర్ణక్రి యకు దోహదం చేస్తుంది. క్రమం తప్పకుండా ప్రేగు కదలికలను ప్రోత్స హిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంవల్ల ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. శరీరంలో నొప్పిని, వాపును తగ్గిస్తుంది. బ్లడ్లో షుగర్ లెవల్స్ను నియంత్రించడం కారణంగా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పరుస్తుంది. కాబట్టి డయా బెటిస్ పేషెంట్లకు కాకర కాయ మంచిది.

* కాకరకాయలో విటమిన్ సి కూడా ఉండటం మూలంగా ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఫలితంగా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మొటిమలు, స్కిన్ అలెర్జీ లను తగ్గించడంలో సహాయపడు తుంది. ఫైబర్ కంటెంట్ మూలంగా కడుపులో ఉబ్బరం, మలబద్ధకం, అధిక బరువు సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి కాకర కాయను ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now