బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు పై మండిపడ్డ బిజెపి

*బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు పై మండిపడ్డ బిజెపి*

నార్సింగి జనవరి 9

మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ  వివిధ గ్రామాలకు మంజూరు చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 30 లక్షల రూపాయలు సీసీ రహదారులకు నార్సింగి మండలంలో మంజూరు చేయగా,మండలం లో స్థానిక బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమే ఇట్టి నిధులు తెచ్చామని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా అసత్య ప్రచారాన్ని మానుకోవాలని అన్నారు. ఇట్టి విషయాన్ని మండల శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాంని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టు బడి వుందిని రానున్న ఎన్నికలలో ప్రజలు ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పే రోజుల్లో దగ్గరలో వున్నాయని తెలపడం జరిగింది.ఈ కార్యక్రమం లో బీజేపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు చంద్ర శేఖర్,మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ ,సీనియర్ నాయకులు యెన్నం లింగా రెడ్డి, పాదం,పెంటా రెడ్డి మల్లికార్జున్,శ్రీనివాస్,సత్యం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment