బీజేపీ, బిఅర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో బెయిల్

*బిజెపి, బిఆర్ఎస్ లోపాయికారి తో కవితకు బెయిల్*

*కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు*

*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో ఆగస్టు 27*

బీఆర్ఎస్ కేంద్రంలోని బిజెపి పెద్దలతో కుమ్మక్కు కావడం వల్లే ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించిందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు మంగళవారం మీడియాకు వెలిచాల రాజేందర్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు కలిసి బిజెపి పెద్దలతో కుమ్మక్కయ్యారని దీంతో 163 రోజులపాటు తీహార్ జైల్లో ఉన్న కవితకు బెయిల్ మంజూరు అయిందని మండిపడ్డారు తరచూ కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్తూ ప్రధానమంత్రి మోడీ హోం శాఖ మంత్రి అమిత్ షా బిజెపి పెద్దలను కలుస్తూ కాళ్ళ వేళ్ళపై పడ్డారని ఆరోపించారు బీఆర్ఎస్ ను బిజెపికి తాకట్టు పెట్టారని విషయము ప్రజలందరికీ అర్థమైందని పేర్కొన్నారు.
మొన్నటి వరకు బిజెపి బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూశారని ధ్వజమెత్తారు ఈ ఫ్యూహరచన అమలు కాలేదని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యి బిజెపికి బిఆర్ఎస్ దాసోహం అయిందని అందుకే వారి ఓట్లన్నీ బిజెపికి వేయించారని కవితకు బెయిల్ కోసమే ఇలా చేశారని ఆరోపించారు
హరిశ్ కేటిఆర్ లు ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ తిరుగుతూ ఆపద మొక్కులు మొక్కారనీ పేర్కొన్నారు బిజెపి నేతల ఇండ్ల చుట్టూ తిరిగి కాళ్ళ మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారనీ బీఆర్ఎస్ ను ఢిల్లీ పెద్దల వద్ద తాకట్టు పెట్టారని ఈ విషయాలన్నింటినీ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని, బీజేపీ, బిఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలు బయట పడ్డాయని విమర్శించారు. ప్రజలు బీఆర్ఎస్, బిజెపి ట్రాప్ లో పడకుండా ఉండాలని సూచించారు
బీజేపీ లో బిఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలు అవుతుందనీ ఇంకా బిజెపిలో బిఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందనీ పేర్కొన్నారు. ప్రజలు వీటన్నిటిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆ రెండు పార్టీల వలలో చిక్కుకోవద్దని వెలిచాల రాజేందర్ రావు సూచించారు.

Join WhatsApp

Join Now