బీజేపీ, బీజేవైఎం, హిందూ నాయకుల అరెస్టు

మెదక్/నర్సాపూర్, ఆగస్టు 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): హైదరాబాద్ లోని పెద్దమ్మ ఆలయం కూల్చినందుకు నిరసనగా బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు పెద్దమ్మ ఆలయ కుంకుమార్చనకు వెళ్తారన్న ఉద్దేశంతో నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం నర్సాపూర్ పోలీసులు అప్రమత్తమై, నర్సాపూర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు చంద్రయ్య, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ యాదవ్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సంగసాని రాజు, హిందూ వాహిని నర్సాపూర్ అధ్యక్షుడు వంశీగౌడ్ తదితరులను ముందస్తు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పెద్దమ్మ ఆలయ తరలింపు హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని విమర్శించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో మరింత తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now