బీసీలకు అన్యాయం చేస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వం
సీపీఎం ఆధ్వర్యంలో నిరసన
సిపిఎం మండల కార్యదర్శి కొప్పుల శంకర్
హుజురాబాద్ అక్టోబర్ 18 కృష్ణ ఆయుధం
బీసీలకు న్యాయంగా రావలసిన 42 శాతం రిజర్వేషన్లను ఇవ్వకుండా కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మోకాలు అడ్డుపెడుతుందని సిపిఎం మండల కార్యదర్శి కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ బీసీలకు 42%రిజర్వేషన్ అమలు చేయాలనీ శనివారం రోజు చేపట్టిన రాష్ట్రవ్యాప్త బందు లో భాగంగా సిపిఎం పార్టీ, పాల్గొని బందు లో భాగస్వామ్యం అయిందని,అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించేంతవరకు కూడా సిపిఎం పార్టీ ప్రత్యక్షంగా పాల్గొని పోరాడుతుందని తెలిపారు కేంద్రంలో అధికారంలో ఉండి బిజెపి ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయకుండా రాష్ట్రంలో రోడ్లపైకి వచ్చి బిజెపి నాయకులు కార్యకర్తలు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని, ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి ఎమ్మెల్యేలు మంత్రులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు న్యాయం చేయాలని అలా కాకుండా ఇచ్చేవాడే,ఆడుకున్నట్టు, కొట్లాడుతున్నట్టు బిజెపి ద్వంద నీతిని అవలంబిస్తూ ప్రజల్ని గందరగోళపరుస్తుందన్నారు.
బిజెపి అధికారంలో ఉన్న మహారాష్ట్ర,గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేస్తూ ఇక్కడ మాత్రం తెలంగాణలో పక్షపాత ధోరణి అవలంబిస్తుందని, రాష్ట్ర అసెంబ్లీలో బిల్లుకు బిజెపి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా అమలు తెలిపి, గవర్నర్ దగ్గర పెండింగ్లో పెట్టి, పార్లమెంటులో అమలు చేయాల్సిన రిజర్వేషన్ అమలు చేయకుండా, అడ్డుకుంటుందని, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకు మాత్రం 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని అసెంబ్లీలో చట్టం చేసి పంపడం వరకే కాకుండా కేంద్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై, రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలను మద్దతు ఇచ్చే పార్టీలను ఏకం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి చట్టబద్ధత కల్పించే విధంగా కృషి చేయాలని కోరారు.
లేనట్లయితే తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు అన్యాయం చేసే మొదటి ముద్దాయిగా బిజెపి కేంద్ర ప్రభుత్వం నిలబడుతుందని అలాగే, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు ఎండి అజ్జు, కొంకట చంద్రయ్య, ప్రతాప శ్రీనివాస్, సారయ్య, శంకర్, రవి, చిరంజీవి, వెంకటేష్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.