మెదక్/నర్సాపూర్, సెప్టెంబరు 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ శ్రీరాం నగర్ కాలనీలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోడ రాజేందర్ ఆధ్వర్యంలో సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం నర్సాపూర్ లో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ.. శ్రీరాం నగర్ కాలనీలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలేష్, ఈశ్వర్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్ లో బీజేపీ సభ్యత్వ నమోదు: బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోడ రాజేందర్
Published On: September 24, 2024 12:40 pm