*సెప్టెంబర్ 3న పోలింగ్ బూత్ అధ్యక్షుల సమ్మేళన ప్రోగ్రాం ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు పర్యటనను సక్సెస్ చేయాలి*
స్థానిక సంస్థల ఎన్నికల కు సిద్ధం కండి
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కరీంనగర్ ఆగస్టు 31 ప్రశ్న ఆయుధం
బిజెపి రాష్ట్ర అధ్యక్షుని హోదాలో మొదటిసారిగా సెప్టెంబర్ 3వ తేదీన కరీంనగర్ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న రామచందర్ రావు కు ఘన స్వాగతం పలకాలని అనంతరం పట్టణంలోని కొండ సత్యలక్ష్మి గార్డెన్స్ లో జరిగే పోలింగ్ బూత్ అధ్యక్షుల సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రోజున కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో బిజెపి ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు ఇట్టి సమావేశానికి హాజరైన జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా తలపెట్టిన ప్రోగ్రాంలన్నీ సక్సెస్ చేయడానికి బిజెపి శ్రేణులు తగిన కృషి చేయాలన్నారు. ఆయా ప్రోగ్రాం ల నిర్వహణ కోసం నియమింపబడ్డ ఇన్చార్జులు తమ తమ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. బిజెపి పోలింగ్ బూత్ శ్రేణులు బూత్ సమ్మేళన సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని తెలిపారు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి బిజెపి శక్తి చాటి చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రధానంగా ఆరు గ్యారెంటీలు, 420 హామీల ప్రభుత్వ మోసాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. అనంతరం మాజీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు మాట్లాడుతూ బిజెపి శ్రేణులకు తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిల్లపు రమేష్, కోమల ఆంజనేయులు, ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, పార్లమెంటు కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు , సీనియర్ నాయకులు కన్నబోయిన ఓదెలు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్ , జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడ వెంకట్ రెడ్డి, గుర్రాల వెంకటరెడ్డి, రంగు భాస్కరాచారి, ఎండి ముజీబ్, దురిశెట్టి సంపత్ , దూబాల శ్రీనివాస్, దండు కొమురయ్య, పుప్పాల రఘు, గుజ్జ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ కొలగని శ్రీనివాస్ లతో పాటు మండల, జోన్ అధ్యక్షులు, ప్రోగ్రాం ఇన్చార్జులు , మోర్చా బాధ్యులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.