Site icon PRASHNA AYUDHAM

జిన్నారం, గుమ్మడిదల మండలంలోని వాహనాలకు టోల్ ప్లాజా పాసులు ఇవ్వాలి: బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి

IMG 20240801 200609

Oplus_0

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల వాహనాలకు గుమ్మడిదల నేషనల్ హైవే టోల్ ప్లాజా యాజమాన్యం పాసులు ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పేర్కొన్నారు. గురువారం గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో గుమ్మడిదల నేషనల్ హైవే టోల్ ప్లాజా యాజమాన్యానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…జిన్నారం, గుమ్మడిదల మండలాలోని గ్రామాల వాహనదారుల నుంచి గుమ్మడిదల టోల్ ప్లాజా నిర్వాహకులు డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. కాగా టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాహనాలకు పాసులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ సి. అంజి రెడ్డి, ఆదెల్లి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గిద్దె రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కుల్కర్ణి, రాజశేఖర్ రెడ్డి, మాణిక్ రావు, పటాన్ చెరు నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version