Site icon PRASHNA AYUDHAM

ఉగ్రవాద అంతం బిజెపి ప్రభుత్వ లక్ష్యం- బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్ రావు

IMG 20250607 WA0054

*ఉగ్రవాద అంతం మోడీ ప్రభుత్వ లక్ష్యం*
*ప్రజా సమస్యల పై పోరాడడానికి బిజెపి ముందుంటుంది*

*బిజెపి మండల ముఖ్య కార్యకర్తల సమావేశం*

*బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు

*ఇల్లందకుంట జూన్ 7 ప్రశ్న ఆయుధం*

దేశంలో ఉగ్రవాదం అనే పదం లేకుండా చేయడమే నరేంద్ర మోడీ లక్ష్యం అని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు అన్నారు. బిజెపి ఇల్లందకుంట మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఇల్లందకుంట మండల సమావేశానికి మండల నాయకులు బూతు అధ్యక్షులు పాల్గొనగా హాజరైన బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్ రావు మాట్లాడుతూ గడిచిన 11 సంవత్సరాలు మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు మహిళలకు మరుగుదొడ్ల నిధులు కేటాయించబడినదని నరేంద్ర మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాల పరిపాలనలో సేవ,సుపరిపాలన, పేదల సంక్షేమానికి పెద్ద పీట వేయడం జరిగిందని కొనియాడారు. మోదీ ప్రభుత్వం సంకల్ప, సాకారం పేరిట బీజేపీ పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకుందని, వాటిని బిజెపి శ్రేణులు విజయవంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు మోడీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనలో ఎన్నో చారిత్రక విజయాలతో ముందు కొనసాగుతున్నదని,నరేంద్ర మోడీ సమర్థవంతమైన, నిర్ణయాత్మక నాయకత్వంలో, వికసిత్ భారత్ లక్ష్యసాధన దిశగా ముందుకు వెళుతుందని తెలిపారు.మోడీ భారతదేశాన్ని ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా నిర్మాణానికి పూనుకున్నారని అదేవిధంగా ఆపరేషన్ సింధుర్ లాంటి చారిత్రాత్మక విజయాలతో దేశ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుందని ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి బీజేపీ కార్యకర్త వారు ఉండే వార్డ్ లల్లో మొక్కలు నాటాలని సూచించారు. అలాగే ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం, 23న డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్, 25న ఎమర్జెన్సీ డే లాంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా ఉపాధ్యక్షుడు బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చాడు.ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా చేపట్టిన భారత త్రివిద దళాలకు, ప్రధాని నరేంద్ర మోదీ కి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశంలో తీర్మానం చేశారు ప్రజా సమస్యల పరిష్కరించడంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని, మండలంలోని పలు సమస్యల పరిష్కారానికి బిజెపి ప్రజల పక్షాన పోరాడాలని చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి, కార్యక్రమ కన్వీనర్ రావుల విజయ్ బాబు, కో కన్వీనర్ గుత్తికొండ రాంబాబు, అంతం ఎల్లారెడ్డి, నల్ల లింగారెడ్డి, మురహరి గోపాల్, మట్ట పవన్ రెడ్డి, ఉప్పు దుర్గయ్య, కొక్కుల దేవేందర్, ఇంగ్లే రమేష్, స్వామి దాస్, కొత్తూరి రవీందర్, గురుకుంట్ల అనిల్, పలకల కిషన్ రెడ్డి, ఉప్పుల శ్రీనివాస్,చిట్ల తిరుపతి, విజయగిరి శ్రీనివాస్, కన్నురి కుమార్ బూత్ కమిటీ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version