*దేశం కోసం పనిచేసే పార్టీ ,క్యాడర్ బెస్ట్ పార్టీ -బిజెపి*
*ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా బిజెపికి గుర్తింపు*
*సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి*
*కాంగ్రెస్, బిఆర్ఎస్ లు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన పార్టీ లు*
*బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ జోన్ ఇన్చార్జి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి*
*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో ఆగస్టు 25*
ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా బిజెపికి గుర్తింపు లభించిందని గతంలో చైనా కమ్యూనిస్టు పార్టీకి ఆ ఖ్యాతి ఉండేదని 2014 తర్వాత దాన్ని వెనక్కి నెట్టిందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీంనగర్ జోన్ ఇన్చార్జి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం కరీంనగర్ లోని బిజెపి జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తదనంతరం జరిగిన రేకుర్తిలోని సాయి మహాలక్ష్మి గార్డెన్లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యాశాల ప్రోగ్రాం సమావేశంలో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బిజెపి అవతరించడానికి ప్రధాన కారణం క్యాడరేనని బేస్డ్ క్యాడర్ కలిగిన పార్టీ బిజెపి పార్టీ అని వ్యక్తుల కోసం కాకుండా దేశం కోసం పనిచేసే పార్టీ అని అన్నారు 2014 లో పార్టీలో సభ్యత్వ నమోదు క్యాంపెయిన్ జరిగిందని పదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుందన్నారు పార్టీ కొత్త సభ్యత్వ నమోదు లో పార్టీ నేషనల్ చీఫ్ మొదలుకొని పోలింగ్ బూత్ స్థాయి వరకు ప్రస్తుతం కొనసాగుతున్న సభ్యులంతా పాత సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకుంటారన్నారు. అలాగే సన్నాక సమావేశాలు వర్క్ షాపులు నిర్వహించి పోలింగ్ బూత్ స్థాయి నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు సభ్యత్వ నమోదు తో పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు సహకరిస్తుందని ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు కోసం తగిన కృషి చేయాలని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన బిఆర్ఎస్ లు ప్రజల విశ్వాసాన్నికోల్పోయాయన్నారు గత బిఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తుందని నాటి బిఆర్ఎస్ బంగారు తెలంగాణ నేటి కాంగ్రెస్ ప్రజా పాలన అట్టర్ ప్లాప్ అయిందని నాటి బీఆర్ఎస్ కుటుంబ స్వార్థం పాకులాడిందన్నారు. కాంగ్రెస్ అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలను రైతులను తీవ్రంగా మోసం మోసం చేసిందని ప్రజల దృష్టిలో ఈ రెండు పార్టీల పట్ల బోగస్ మోసం అనే భావన ఏర్పడిందన్నారు. అందుకే ప్రజలంతా బిజెపి వైపు చూస్తున్నారని దేశంలోనే కాదు తెలంగాణలో కూడా బిజెపి అధికారంలోకి రావాలని బలంగా ఆకాంక్షిస్తూ న్నారని తెలిపారు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి ఓటింగ్ శాతం బలంగా పెరిగిందన్నారు ఎన్నికలు ఏవైనా బూత్ స్థాయిలో విజయం సాధించాలంటే సభ్యత్వం కీలకమన్నారు అందుకోసమే జరగబోయే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చారు అనంతరం బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాజీ జిల్లా అధ్యక్షుడు భాస సత్యనారాయణ రావు మాజీ మేయర్ డి శంకర్ మాజీ ఎంపీపీ వాసాల రమేష్ తదితరులు మాట్లాడారు కరీంనగర్ జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి సభ్యత్వానికి సంబంధించిన పలు విషయాలపై బిజెపి శ్రేణులకు మార్గ నిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమం లో బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కొరటాల శివరామయ్య ఈనుకొండ నాగేశ్వర్ రెడ్డి గుగ్గిల్లపు రమేశ్ సీనియర్ నాయకులు బాస సత్య నారాయణ మాజీ మేయర్ డి శంకర్ వాసాల రమేశ్ బిజేపి జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ బత్తుల లక్మి నారాయణ మాడ వెంకట్ రెడ్డి కరీంనగర్ పార్లమెంటు కన్వినర్ బోయినపల్లి ప్రవీణ్ రావు సభ్యత్వ నమోదు కో కన్వీనర్స్ జాడీ బాల్ రెడ్డి గుర్రాల నిర్మలా దేవీ నరసింహ రాజు బిజేపిజిల్లా ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం కళ్లెం వాసుదేవా రెడ్డి ఎర్రవెల్లి సంపత్ రావు కన్న కృష్ణా రంగు భాస్కరాచారి కార్పొరేటర్లు బండా సుమ చొప్పరి జయశ్రీ కొలగాని శ్రీనివాస్ పవన్ శ్రీనివాస్ బిజేపి జిల్లా పదాధికారులు,అసెంబ్లీ కన్వీనర్ లు రాష్ట్ర కాన్సిల్ సభ్యులు మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు సభ్యత్వ మండల కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు