బీజెపి ఎవ్వర్నీ విలీనం చేసుకునేందుకు సిద్ధంగా లేదు… ఎంపీ రఘునందన్ రావు..
సిద్దిపేట : బీజేపీ ఎవర్నీ విలీనం చేసుకునేందుకు సిద్ధంలేదని ఎంపీ రఘునందన్ రావు క్లియర్ గా చెప్పారు. విలీనంపై మేము ఎవరితో సంప్రదింపులు చేయలేదన్నారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తే బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు?. ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని,అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ఎదిగిందని ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేసారు.