బిజెపి హిందూ మతోన్మాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం

బిజెపి హిందూ మతోన్మాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తుంది

ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యింది

సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతినేని సుదర్శన్ రావు.

IMG 20241109 WA0076 scaled

భారతీయ జనతా పార్టీ దేశంలో హిందూ మతోన్మాదాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తుందని, అయోధ్యలో జరిగిన ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన బిజెపి అభ్యర్థిని ప్రజలు తిరస్కరించాలని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విమర్శించారు.ఖానాపూరo హవేలీ 8వ మండల మహాసభ సందర్భంగా 2005లో మణుగూరు లో జరిగిన సిపిఎం పార్టీ జిల్లా మహాసభలకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆరుగురు అమరవీరుల జ్ఞాపకార్ధంగా నిర్మించిన స్థూపాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ఆవిష్కరించారు .అనంతరం స్తూపం వద్ద పార్టీ జెండాని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు బుగ్గ వీటిసరళ ఆవిష్కరించారు. అక్కడి నుండి ప్రదర్శనతో టేకులపల్లి గ్రామంలో జరిగిన మహాసభ ప్రాంగణానికి మహాసభ ప్రారంభ సూచకక పార్టీ జెండాని సీనియర్ నాయకులు పెద్ది నాగయ్య ఆవిష్కరించారు అనంతరం అమర పోయిన శివరాం ప్రసాద్ నగర్ లో జరిగింది ప్రారంభ సభకు అధ్యక్ష వర్గంగా అమరబోయిన అంజని జట్ల ఆనందరావు కొంగరి నవీన్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు ఈ సభలోసిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ దేశంలో మోడీ అధికారంలోకి వచ్చాక నల్లధనం మొత్తం బయటికి తీస్తానని ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు జండన్ ఖాతా ద్వారా ఎకౌంట్లో వేస్తానన్నాడని,రెండోసారి అధికారంలోకి వచ్చాక నల్లధనం వెలికితీయ పోక దేశ సంపదను దోచుకున్న బడా పెట్టుబడిదారులకు కాపాడే ప్రయత్నం చేశాడని ఆరోపించారు.మతం పేరుతో కల్లోలాలు సృష్టించి దేశంలో హిందూ మతోన్మాదాన్ని అడ్డం పెట్టుకొని బిజెపి రాజకీయం చేస్తుంది అన్నారు .మూడోసారి జరిగిన ఎన్నికల్లో అయోధ్యలో రామ్ మందిరం అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు తిరస్కరించి అక్కడ బిజెపి అభ్యర్థిని ఓడించడం జరిగింది అని అన్నారు జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆరు గారెంటీలు అమలు చేస్తానని వాగ్దానం చేసింది కానీ చేసిన ఏ ఒక్క వాగ్దానం పూర్తిగా అమలు చేయడంలో విఫలమైంది కార్మికులకు కనీస వేతనం అమలు చేయడo లేదు కులగరణ పేరుతో ప్రజల సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు . అనంతరం కార్యదర్శి నివేదికను పార్టీ మండల కార్యదర్శి దొంగల తిరుపతరావు ప్రవేశపెట్టారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు య శ్రీకాంత్, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కళ్యాణ వెంకటేశ్వరరావు వై విక్రం జిల్లా కమిటీ సభ్యులు పిన్నింటి రమ్య ఎర్ర శ్రీనివాసరావు రాళ్లపల్లి కృష్ణ బండారు రమేష్ పారుపల్లి ఝాన్సీ, నవీన్ రెడ్డి ఎంఏ జబ్బార్, స్థానిక నాయకులు పార్టీ మండల కమిటీ సభ్యులు,పార్టీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ నూతన కమిటీని 20 మందిని ఏకగ్రీవంగాఎన్నుకోవడం జరిగింది. నూతన మండల కార్యదర్శిగా దొంగల తిరుపతిరావుని తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మహాసభలో త్వరలో జరగబోయే డివిజన్ మహాసభకు 56 మంది ప్రతినిధులను ఎంపిక చేయడం జరిగింది.

Join WhatsApp

Join Now