ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీబీజేపీ..!!

నారాయణఖేడ్ లో మాజీ ఎంపీ బీబీ పాటిల్ సమావేశం 

సంగారెడ్డి/నారాయణఖేడ్, సెప్టెంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): బీజేపీ ప్రపంచంలోనే ఎక్కువ సభ్యత్వం కలిగిన అతి పెద్ద పార్టీ అని జహీరాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు బీబీ పాటిల్ తెలిపారు. సోమవారం రాత్రి బీజేపీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో బీజేపీ సభ్యత్వం గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రపంచంలోనే ఎక్కువ సభ్యత్వం కలిగిన అతి పెద్ద పార్టీ అని, నారాయణఖేడ్ నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వాలు అధిక సంఖ్యలో ఉండాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. బీజేపీ కార్యకర్తలకు అండగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బస్వరాజ్, అరుణ్‌రాజ్ శేరికార్, రాజు రాథోడ్, జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ, నారాయణఖేడ్ కో కన్వీనర్ నగేష్ యాదవ్, మండల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now