*దేశం కోసం ధర్మ కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ బిజెపి*
*హుజురాబాద్ నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతంరెడ్డి*
*జమ్మికుంట /ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 12*
గురువారం రోజున ఇల్లందకుంట మండలం లోని సిరిసీడు గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి హాజరైన హుజురాబాద్ నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతంరెడ్డి మాట్లాడుతూ యువత పెద్ద ఎత్తున బిజెపి సభ్యత్వం తీసుకోవాలని దేశం కోసం, ధర్మం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నరేంద్ర మోడీకి మద్దతుగా పెద్ద ఎత్తున బిజెపిలో చేరాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఇప్పటికే 18 కోట్ల సభ్యత్వలతో ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం గల రాజకీయ పార్టీగా బిజెపి ఉన్నదని గుర్తు చేశారు గత పది సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోవడంలో మోడీ సఫలీకృతమయ్యాడని గౌతమ్ రెడ్డి కొనియాడారు నరేంద్ర మోడీ చేస్తున్న సేవలను గుర్తించిన దేశ ప్రజలు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ కి అండగా నిలిచారని ప్రజల ఆశీస్సులతో దేశ ప్రధానిగా మూడోసారి ఎన్నికయ్యారని అన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని గతంలో పాలించిన బిఆర్ఎస్ పట్ల ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పట్ల తెలంగాణ ప్రజలకు విశ్వాసం పోయిందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం రావడం ఖాయమని దానికి అనుగుణంగా ఇప్పటినుండే బిజెపి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని గౌతంరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి బిజెపి కార్యకర్త సభ్యత్వ నమోదులో పాల్గొని ప్రతి బూతులు 200 పైచిలుకు సభ్యత్వాలు అయ్యే విధంగా కృషి చేయాలని బీజేపీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి సభ్యత్వ నమోదు మండల కన్వీనర్లు మట్ట పవన్ రెడ్డి గుత్తికొండ రాంబాబు గురుకుంట్ల సాంబన్న ఎండి షఫీ ఖాన్ ఆరేళ్ళీ శ్రీనివాస్ కంకనాల సురేందర్ రెడ్డి కందాల రాజేందర్ రావుల విజయ్ బాబు మురహరి శంకర్ ఉప్పు దుర్గయ్య జంగం సమ్మయ్య ముడుపు బాపు రెడ్డి,కొత్త శ్రీనివాస్,బండి రాజు తాళ్ళ పాపి రెడ్డి తుపాకుల సతీష్ ఇంగ్లే రమేష్ చల్ల జగన్ రెడ్డి తిప్పరబోయిన సమ్మయ్య, ఉప్పు దుర్గయ్య,గురుకుంట్ల సంజీవ్, కళాల సంజీవ్ రెడ్డి,మామిడి విజయ్,జోడు సంపత్,న్యల లింగయ్య, మహంకాళి రమ,భోగం సమ్మయ్య కొక్కుల దేవేందర్,భోగం అశోక్ కాంపేట సంతు పాకం భిక్షపతి,రెడ్డి కుమార్,బొమ్మీడి తిరుపతి రాం శివ రాకేష్ శ్రీనివాస్ ఒద్ది రాజు తదితరులు పాల్గొన్నారు.