దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ఏకైక పార్టీ బిజెపి

*దేశం కోసం, ధర్మం కోసం పని చేసే ఏకైక పార్టీ బిజెపి*

*సభ్యత్వ నమోదులో జిల్లాలోనే మండలాన్ని మొదటి స్థానంలో నిలపాలి*

*బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారి*

*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో సెప్టెంబర్ 11*

భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం బుధవారం రోజున గన్నేరువరంలో మండల అధ్యక్షుడు నగునూరి శంకర్ అధ్యక్షతన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారి హాజరై మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం, సమాజ శ్రేయస్సు కొరకు పనిచేసే ఏకైక పార్టీ బిజెపి అని,ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు బిజెపి లో మాత్రమే ఉంటారని పేర్కొన్నారు.సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని తమ తమ పోలింగ్ బూత్ పరిధిలో 200 లకు తగ్గకుండా సభ్యత్వాలు నమోదు చేయించి జిల్లా లోనే గన్నేరువరంను మొదటి స్థానంలో నిలపాలన్నారు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం దేశాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిందని త్వరలోనే ప్రపంచంలో భారత దేశం విశ్వగురు స్థానంలో నిలుస్తుందన్నారు. దేశ రక్షణ, ధర్మ సంరక్షణ దేశాభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరు బిజెపి పార్టీలో సభ్యత్వం నమోదు చేసుకోవాలని ప్రజలకు పిలిపునిచ్చారు. పలువురు బిజెపి సభ్యత్వాన్ని తీసుకున్నారు మానకొండూర్ అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శులు తాళ్లపెల్లి పర్శరాములు గౌడ్, వీరగోణి వెంకటేష్, మండల సభ్యత్వ నమోదు కన్వీనర్ బూట్ల జగన్మోహన్, కో కన్వీనర్ పుల్లెల రాము,మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్, దళిత మోర్చా మండల అధ్యక్షులు బామండ్ల రాజు, బొమ్మ మహేష్, గోవర్ధన్ రెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి, జైపాల్ రెడ్డి, పర్శరాం రెడ్డి రాజేందర్, సురేందర్ రెడ్డి, వి రాములు ,దేవరాజు, కంసాని సత్తయ్య ,గుంటి అంజి, పి .అనిల్, సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now