*సమిష్టి నిర్ణయం కలిగిన పార్టీ, కార్యకర్తల పార్టీ ,బిజెపి పార్టీ*
*ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం గల పార్టీగా బిజెపి*
*బిజెపి మహిళ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మలాదేవి*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 11*
సమిష్టి నిర్ణయాలు కలిగిన పార్టీ కార్యకర్తల పార్టీ బిజెపి పార్టీ అని ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం కలిగిన రాజకీయ పార్టీగా బిజెపి ఉన్నదని మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మలా దేవి అన్నారు బుధవారం రోజున జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో బీజేపి పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ గాంధీ చౌరస్తాలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించగా పెద్ద ఎత్తున యువత చేరుకోగా హాజరైన బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మలాదేవి మాట్లాడుతూ దేశంలో ఉన్న అత్యధిక రాజకీయ పార్టీలు కొంత మంది వ్యక్తుల మీద ఆధారపడి ముందుకు వెళ్తాయని, కానీ బీజేపీ పార్టీ కార్యకర్తల పార్టీ అని ఒక వ్యక్తి మీద ఆధారపడి నడిచే పార్టీ కాదని, సమిష్టి నిర్ణయం ప్రకారం ముందుకు వెళుతుందని తెలిపారు ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ప్రతి కార్యకర్త సభ్యత నమోదు చేసుకోవాలని కేంద్రంలోని బీజేపీ (నరేంద్ర మోడీ) ప్రభుత్వం గత పది సంవత్సరాలలో దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడంలో సఫలీకృతం కావడం జరిగిందని అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా మోడీ పరిపాలన వున్నదని నిర్మలాదేవి కితాబిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదని, వారు ఎన్నికల సమయంలో చెప్పిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా కనుమరుగు అయిందని తెలంగాణ ప్రజలకు అండగా బిజెపి పార్టి వున్నదని, తెలంగాణ ప్రజలు బిజెపి తెలంగాణలో అధికారం రావాలని కోరుకుంటున్నారని మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నారు దానికి నిదర్శనమే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి వచ్చిన ఓట్లు, సీట్లు అని అన్నారు. ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారని, వారు ప్రాంత అభివృద్ధి తో పాటు కార్యకర్తలకు ఏ ఆపద వచ్చిన అండగా ఉంటారని నిర్మల దేవి భరోసా ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున బిజెపి సభ్యత్వం చేయాలని సూచించారు. తటస్థంగా ఉన్న వ్యక్తులను, ముఖ్యంగా యువతను, మహిళలను,రైతులను, కార్మికులను పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేయించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ పల్లపు రవి ఠాగూర్ రాజేష్ కైలాస కోటి గణేష్ కొలకని రాజు మోతే స్వామి అప్పం మధు యాదవ్ ఇటికల స్వరూప కొమ్ము అశోక్ మేక సుధాకర్ రెడ్డి మోడెం రాజు బల్సుకురి రాజేష్ గిరవేణి విజేందర్ గండికోట సమ్మయ్య, కొండ్లె నాగేష్, బూరుగుపల్లి రామ్, గర్రెపల్లి నిరుపా రాణి, ఉడుగుల రవికుమార్, రెవెలి శీను, ముకుందం సుధాకర్, ఉడుగుల మహేందర్, అప్పల రవీందర్, కొండపర్తి ప్రవీణ్, పొన్నగంటి రవికుమార్, మాదాడి సమ్మిరెడ్డి, మంతిని అశోక్ తాళ్లపల్లి తిరుపతి, గట్టు రాకేష్, పోలు వెంకటేష్, పోలు అన్నమయ్య, ఆకుల పోశయ్య, దార కృష్ణ చందా మహేందర్, కేశ స్వరూప, మైస భాగ్య, ఇజిగిరి రవీందర్, నెల్లి రాజు, A రామస్వామి, మైస లక్ష్మి, కోడూరి శ్రీకాంత్, మేడిపల్లి మహేష్ మిల్ పూరి రాజు తదితరులు పాల్గొన్నారు