ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి నీ చేసిన పార్టీ బీజేపీ..
-గిరిజనుల హక్కుల సాధన బీజేపి తోనే సాధ్యం
-ప్రతి లంబాడా సోదరులు బీజేపీ లో సభ్యత్వం చేసుకోవాలి
-బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్
కామారెడ్డి టౌన్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 23:
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండు ముందు గిరిజన మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ. ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి నీ చేసిన పార్టీ బీజేపీ పార్టీకి దక్కుతుందని అన్నారు. గిరిజనుల హక్కుల సాధన బీజేపి తోనే సాధ్యం అవుతుందని అన్నారు. ప్రతి లంబాడా సోదరులు బీజేపీ లో సభ్యత్వం చేసుకోవాలనీ విజ్ఞప్తి చేశారు. దేశంలోని మారుమూల ప్రాంతంలో సైతం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతుందని అన్నారు. ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీలు బీజేపీ సభ్యత్వం తీసుకోవటానికి ముందుకు వస్తున్నారని అన్నారు.
ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి నీ చేసిన పార్టీ బీజేపీ..
by kana bai
Published On: October 23, 2024 5:09 pm