సంగారెడ్డి/నారాయణఖేడ్, మర్చి 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): హోలీ పండుగ రోజు రసాయన రంగులు వాడొద్దని, పూల రంగులే ముద్దు అని బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ఈసీ సభ్యుడు అరుణ్ రాజ్ శేరికార్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. పండగ రోజు రసాయన రంగులు వాడి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని అన్నారు. పువ్వుల రంగులు వాడి సంతోషంగా హోలీ పండుగను జరుపుకోవాలని తెలిపారు. పండుగ రోజు యువత మద్యం సేవించి వాహనాలు నడపకూడదని అరుణ్‌రాజ్ శేరికార్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగ ప్రజలందరికీ హోలీ పండుగ శుభకాంక్షలు తెలిపారు.
హోలీ పండుగకు రసాయన రంగులు వాడొద్దు: బీజేపీ నాయకుడు అరుణ్ రాజ్ శేరికార్

Oplus_131072