కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మరిచింది: బీజేపీ నాయకుడు అరుణ్‌రాజ్ శేరికార్

సంగారెడ్డి/నారాయణఖేడ్, డిసెంబరు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మరిచిందని, కౌలు రైతులకు డబ్బులు డిసెంబరు 28వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పటం జరిగిందని, మరి తేదీ దాటిపోయినా కౌలు రైతుల గురించి మాట్లాడటం లేదని బీజేపీ నాయకుడు అరుణ్‌రాజ్ శేరికార్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గంటకు ఒక మాట చెప్పటం, వాటిని అమలు చేయకుండా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని తెలిపారు. పథకాలు ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెడుతూ ఎన్నికల్లో గెలవడానికి తప్పా ప్రజలకు న్యాయం చేయడానికి కాదని మండి పడ్డారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని, అసెంబ్లీ మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు అబద్దాలు చెప్పి రాష్ట్రాన్ని నడుపుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేయాలని అరుణ్‌రాజ్ డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now