Site icon PRASHNA AYUDHAM

హాస్టల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి: బీజేపీ నేత అరుణ్‌రాజ్ శేరికార్

IMG 20250722 201251

Oplus_0

సంగారెడ్డి/నారాయణఖేడ్, జూలై 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగలిగిద్ద మండలం మోర్గి గ్రామంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కారణంగా 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, హాస్టల్ నిర్వాహకులు, ఆహార సరఫరాదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఈసీ సభ్యుడు అరుణ్‌రాజ్ శేరికార్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, హాస్టళ్లలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని, హాస్టల్లో నాణ్యమైన ఆహారం అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Exit mobile version