రామకోటిరామరాజు సేవలు అమోఘం
– వెంకట్ రాంరెడ్డి
భద్రాచల తలంబ్రాలు అందుకున్న బీజేపీ నేత వెంకట్ రాంరెడ్డి దంపతులు
భద్రాచలం వెళ్లలేకపోయినా తలంబ్రాలు అందుకున్నామన్న ఆనందం
శ్రీరాముల కళ్యాణానికి గోటి తలంబ్రాలు అందించిన ఘనత రామకోటిరామరాజుకే
భక్తి భావాన్ని పెంపొందిస్తున్న రామరాజు సేవలు ప్రశంసనీయం
భద్రాచల తలంబ్రాలు ఇంట్లో ఉండడం శ్రీరామరక్ష
ప్రశ్న ఆయుధం సిద్దిపేట, ఆగస్టు 6:
భద్రాచల తలంబ్రాలు, స్వామి వారి శేష వస్త్రాలు బుధవారం నాడు రెడ్డి జాగృతి, బీజేపీ కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు పాలకొల్లు వెంకట్ రాంరెడ్డి దంపతులకు అందజేశారు శ్రీరామకోటిభక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు.
ఈ సందర్భంగా వెంకట్ రాంరెడ్డి మాట్లాడుతూ – “భద్రాచలం వెళ్లలేకపోయినా మా ఇంటికి స్వామివారి తలంబ్రాలు రావడం మా అదృష్టం. ఈ సేవలు చేయగలిగిన రామకోటిరామరాజు ధార్మిక సేవలు అమోఘం. భక్తి భావాన్ని ప్రతి ఒక్కరిలో నూరిపోస్తున్నారు. ఇంట్లో భద్రాచల తలంబ్రాలు ఉండటం అంటే శ్రీరామరక్షే” అని పేర్కొన్నారు.రామకోటిరామరాజు సేవలు పట్ల అనేకమంది భక్తులు ప్రశంసలు కురిపించారు.