అంబేద్కర్ జయంతి వేడుకలు తూతూ మంత్రంగా నిర్వహించారని కమీషనర్ తో బిజెపి నాయకుల వాగ్వివాదం

*అంబేద్కర్ జయంతి వేడుకలు తూతూ మంత్రంగా నిర్వహించారని కమీషనర్ తో బిజెపి నాయకుల వాగ్వివాదం*

*జమ్మికుంట ఏప్రిల్ 14 ప్రశ్న ఆయుధం*

IMG 20250414 WA4169

పట్టణంలో అంబేద్కర్ జయంతి వేడుకలను జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఎండి ఆయాజ్ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించి తూతూ మంత్రంగా నిర్వహించారని బిజెపి పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీను, బిజెపి జమ్మికుంట పట్టణ మాజీ అధ్యక్షుడు జీడి మల్లేష్, బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ నిలదీసి వాగ్వివాదానికి దిగారు.గతంలో మున్సిపల్ పరిధిలో మహనీయుల జయంతి, వర్థంతి వేడుకలను మున్సిపల్ అధికారులు ఘనంగా నిర్వహించే వారని అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఇచ్చి మధ్యాహ్నం వరకు నిర్వహించే వారని, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ తూతూ మంత్రంగా అరగంటలో ముగించడం ఏమిటని వారు ప్రశ్నించారు. అక్కడికి బిజెపి పార్టీ నేతలు రాగానే ప్రోగ్రాం ముగిసింది అని మున్సిపల్ కమిషనర్ వెళ్తుంటే బిజెపి నేతలు నిలదీయగా నిర్లక్ష్యంగా దాటవేసే ధోరణితో సమాధానం ఇవ్వగా బిజెపి నేతలు కమిషనర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రత్యేక అధికారి అదనపు కలెక్టర్ ప్రపూల్ దేశాయ్ లేకుండా మున్సిపల్ కమిషనర్ జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ జయంతి వేడుకలు నామా మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకోవడం సిగ్గు చేటని కమిషనర్ ఆయాజ్ ఇప్పటికైనా నిర్లక్ష్య వైఖరి వీడి రానున్న రోజుల్లో మహనీయుల జయంతి వేడుకలను అన్ని పార్టీలను కలుపుకుని ఘనంగా నిర్వహించాలని హెచ్చరించారు. కేవలం అధికార పార్టీ జీత గాడిల వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటిసి శ్రీరామ్ శ్యామ్, బిజెపి నాయకులు పల్లెపు రవి,మోతె స్వామి, ఇటుకాల స్వరూప, నిరుపరాణి, మోడం రాజు, రాచపల్లి ప్రశాంత్, కొమ్ము అశోక్, బూరుగుపల్లి రాము, యగ్గని చందు, రాకేష్ ఠాకూర్, కేస స్వరూప, కనుమల్ల లక్ష్మి, మైస లక్ష్మి, విజయ్, పోడెటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment