గజ్వేల్ పట్టణంలో బీజేపీ నాయకుల ప్రచారం
గజ్వేల్, 12 ఫిబ్రవరి 2025 : ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం బిజెపి బలపరచిన ఎమ్మెల్సీ అభ్యర్థి సి.అంజి రెడ్డి కి మద్దతుగా గోదావరి అంజి రెడ్డి కోర్టు బార్ అసోసియేషన్, ఆర్మీ అకాడమీ లో ప్రచారం నిర్వహించారు. వారి వెంట గజ్వేల్ పట్టణ, మండల అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, పంజాల అశోక్ గౌడ్ లు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో అందరి ఆదరాభిమానాలు సంపాదించారు. తన వ్యాపారంలో భాగంగా వందల మందికి ఉపాధి కల్పించారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం, స్కాలర్షిప్ అందించారు. ప్రభుత్వ బడులు, కళాశాలలో మౌలిక వసతుల కోసం విరాళాలు అందించారు. ఆయా ప్రభుత్వ బడుల్లో, కళాశాలల్లో 60 లక్షల రూపాయల విలువైన ల్యాబ్స్ సౌకర్యం కల్పించారు. ఎస్ ఆర్ ట్రస్ట్ స్థాపించి ఉచిత నీటి వసతి కల్పించారు. చాలా ప్రాంతాల్లో ఆర్ ఓ ప్లాంట్లను స్థాపించి 24 గంటలు ఉచితంగా నీటి పంపిణీ చేశారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రూ.40 లక్షలకు పైగా నష్టపరిహారం అందజేశారు. ఆటోడ్రైవర్లకు, పేదలకు ఉచితంగా ఆరోగ్య బీమా సదుపాయం కల్పించారు. సి.అంజి రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. శాసనమండలిలో పట్టభద్రుల తరఫున మాట్లాడే గొంతుకను నిలబెట్టండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు యెల్లు రాంరెడ్డి, కుడిక్యాల రాములు, ఉప్పల మధుసూదన్, నీల చంద్రం, నాయిని సందీప్ కుమార్, తిరుపతి రెడ్డి, మంద వెంకట్, భాస్కర్ రెడ్డి, నరసింహాచారి, కొన్ని రాజశేఖర్ రెడ్డి, గణేష్, కుమార్ గౌడ్, భీం కుమార్, హరి కుమార్, దుబ్బకుంట భక్త మాల, తదితరులు పాల్గొన్నారు.