సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన బీజేపీ నాయకులు

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): మూడవసారి దేశ ప్రధానిగా ఎన్నికై దేశ ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి, అలుపెరుగని కృషితో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న లోక నాయకుడు నరేంద్ర మోదీ అని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజిరెడ్డి, ఎడ్ల రమేష్, రాజేశ్వర్ దేశ్ పాం, విష్ణువర్ధన్ రెడ్డి, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి, పోచారం రాములు, ప్రతాపరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొలుకూరి రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ రాజు గౌడ్, జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయకుమార్, కౌన్సిలర్లు మందుల నాగరాజ్, కసిని వాసు, పుల్లంగారి సురేందర్, మీనా గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ యాదవ్, సాయి, మధు లవన్ లక్ష్మి, సుజాత, పుణ్యవతి, హనుమంత్ రెడ్డి, నర్సారెడ్డి, రాజేందర్ రెడ్డి, పాపయ్య, సదానంద చారి, శ్రీకాంత్ రెడ్డి, సుధాకర్, నరేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now