నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన బీజేపీ నాయకులు

మెదక్/నర్సాపూర్, సెప్టెంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): విశ్వ వేదికపై మాతృదేశ గౌరవాన్ని ఇనుమడింపచేసిన సర్వ సమర్థ నాయకుడు, వికసిత్ భారత్ రథసారథి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్, మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు బుచ్చేష్ యాదవ్, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోడ రాజేందర్ లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ యాదగిరి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బాదే బాలరాజు, నర్సాపూర్ మండల అధ్యక్షుడు నీలి నాగేష్, నర్సాపూర్ టౌన్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి రమేష్, రామ్ రెడ్డి, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now