మెదక్/నర్సాపూర్, మే 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల వ్యాప్తంగా అక్రమంగా నివాసముంటున్న పాకిస్తాన్, బంగ్లాదేశీయులను వెంటనే తిరిగి వారి దేశాలకు పంపించాలని చిలిపిచెడ్ పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. చిలిపిచెడ్ మండలంలో అక్రమంగా నివాసముంటున్న పాకిస్తాన్, బంగ్లాదేశీయులను వెంటనే తిరిగి వారి దేశాలకు పంపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజేందర్, ఓబీసీ జిల్లా జీఎస్ సత్యనారాయణగౌడ్, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు.
చిలిపిచెడ్ పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ నాయకుల వినతి
Updated On: May 8, 2025 8:25 am