Site icon PRASHNA AYUDHAM

బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని బిజెపి నాయకుల ఇంటింటికి ప్రచారం

IMG 20250221 WA0087

*బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని బిజెపి నాయకుల ఇంటింటికి ప్రచారం*

*జమ్మికుంట ఫిబ్రవరి 21 ప్రశ్న ఆయుధం*

బిజెపి పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు ఆద్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని కృష్ణ కాలనీ, ఎంప్లాయిస్ కాలనీలలో పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని పట్టభద్రుల ఓటరు ఇంటింటికీ ప్రచారం చేపట్టి బిజెపి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఈ సందర్భంగా కొలకాని రాజు మాట్లాడుతూ ఈ ఎన్నికలు టీచర్స్, డిగ్రీ ఆపై స్థాయి విద్యావంతులు, మేధావులు వేసే ఎన్నిక అని రానున్న రోజుల్లో నిరుద్యోగ యువత కొసం టీచర్ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే కొట్లాడే ఎన్నిక అని, అధికార పార్టీ లో ఉండే వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరని ప్రశ్నించే గొంతుక వినిపిచాలంటే బిజెపి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య లకు మొదటి ప్రాధాన్యత ఓటును 1 వెయ్యాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చ జిల్లా అధికార ప్రతినిధి కంకణాల రమాదేవి, పట్టణ ఉపాధ్యక్షులు అప్పం మధు, పల్లపు రవి,బురుగుపల్లి రాము, కొండపర్తి ప్రవీణ్, ముకుందా సుధాకర్, కురిమిల్ల అశోక్, మడిశెట్టి శ్రీనాథ్, కేస స్వరూప, ముకుంద సాయి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version