*నూతన ఎస్సైని మర్యాదపూర్వ కలిసి సన్మానించిన బిజెపి నాయకులు*
*జమ్మికుంట ఇల్లందకుంట జూలై 3 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల ఎస్ హెచ్ ఓ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఎం క్రాంతి కుమార్ ను మండల బిజెపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు అనంతరం బిజెపి మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి ఎస్సై క్రాంతి కుమార్ తో మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో పార్టీలకతీతంగా వ్యవహరించాలని తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించాలని ఇల్లందకుంట మండలం ప్రశాంతంగా ఉంటుందని మండలంలోని ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డితో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కంకణాల రవీందర్ రెడ్డి, తడిగోప్పుల రమేష్, రావుల విజయ్ బాబు, తాళ్ల పాపిరెడ్డి, కొక్కుల దేవేందర్, వలసాని సునీల్, తిరుపతి మొండయ్యా తదితరులు పాల్గొన్నారు