మండలంలో సీఎం వ్యాఖ్యలపై బిజెపి నేతలు నిరసన
కామారెడ్డి జిల్లా తాడ్వాయి
(ప్రశ్న ఆయుధం) నవంబర్ 2
జూబ్లీహిల్స్ బైఎలక్షన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆపరేషన్ సింధూర పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆదివారం రోజున మండల కేంద్రంలో బిజెపి నాయకులు నిరసన తెలిపారు.
రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాటిమీది గంగారెడ్డి, మండల అధ్యక్షుడు వెల్మ సంతోష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి హోటల్ సీను, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట్రావు, మండల నాయకులు స్వామి రెడ్డి, ముదం యాది రాజు, రవీందర్ రెడ్డి, సురేష్, బాలరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
నాయకులు మాట్లాడుతూ — “ప్రజలను విభజించే, సైనికుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా సీఎం వ్యాఖ్యలు ఉండటం తీవ్రంగా ఖండనీయమని” ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.