నర్సాపూర్ లో నల్లజెండాలతో బీజేపీ నాయకుల నిరసన

నర్సాపూర్ లో నల్లజెండాలతో బీజేపీ నాయకుల నిరసన

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 25(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో సరైన నిధులు కేటాయించలేదని నిరసన తెలిపారు. అంబేడ్కర్ చౌరస్తా వద్ద నల్ల జెండాలు పట్టుకుని రాస్తారోకో చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Join WhatsApp

Join Now