ప్రధాని మోదీ మన్ కి బాత్ వీక్షించిన బిజెపి నేతలు
కరీంనగర్ ఆగస్టు 31 ప్రశ్న ఆయుధం
కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పార్టీ నేతలతో కలిసి ఆదివారం రోజున ప్రసారమైన ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్ కీ బాత్ లో ఆపరేషన్ పోలో విషయాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారని తెలిపారు.నిజాం అరాచక పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అతి తక్కువ కాలంలోనే ఆపరేషన్ పోలోను నిర్వహించి, భారతదేశంలో విలీనం చేశారని, 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ మాత్రం ఇంకా నిజం చెరలోనే ఉండిపోయిన సందర్భాన్ని ప్రధాని గుర్తు చేశారన్నారు. అమాయక ప్రజలపై రజాకార్లు అత్యాచారాలు హత్యలకు తెగబడ్డారని,వీటిని చూసి సహించలేకపోయిన అప్పటి ఉప ప్రధాని సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ పై ప్రత్యేక సైనిక చర్యను చేపట్టి భాగ్యనగరాన్ని భారతదేశంలో కలిపేశారనే విషయాన్ని ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో వివరించారని తెలిపారు. అందుకే సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి , ఆపరేషన్ పోలోలో భాగమైన వీరులను స్మరించుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని ఆయన తెలిపారు.