ఢిల్లీ మాదే రేపు గల్లి మాదే అంటున్న బిజెపి నేతలు
ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 08: కూకట్పల్లి ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా కూకట్ పల్లీ బిజెపి కార్యాలయం వద్ద విజయోత్సవ సంబరాలు కూకట్ పల్లీ డివిజన్ అధ్యక్షుడు అనంత నాగరాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్శనపల్లి సూర్యరావు మరియు వడ్డేపల్లి రాజేశ్వరరావు విచ్చేశారు, కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు కార్యకర్తలు టపసులు పేల్చి స్వీట్లు పంచి విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించన అనంతరం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్శనపల్లి సూర్యరావు మాట్లాడుతూ బిజెపి 27 సంవత్సరాల తరువాత డిల్లి ఎన్నికలలో 48 సీట్లలను గెలిచిన సందర్భంగా కూకట్ పల్లీ గల్లిలలో సంబరాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, అవినీతి నిర్మూలనే ఎజెండాగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ మరియు తన ఆప్ పార్టీ, అవినీతి రాజకీయాలతో ఢిల్లీ ప్రజలను మోసం చేసి పది సంవత్సరాలు అధికార దాహంతో అవినీతి సంపదే లక్ష్యంగా పెట్టుకుని లక్షల కోట్ల ప్రజల సొమ్మును దోచుకుని విలాసవంతమైన జీవనాన్ని గడుపుతూ, లిక్కర్ స్కాం, మత ఘర్షణలు , కాలుష్య నివారణకై చర్యలు తీసుకోకపోవడం ఇలా రోజుకు ఒక సమస్యలో ఆప్ నేతలు ముడి పడడంతో డిల్లి ప్రజలు విసిగిపోయి చెయ్యి గుర్తు పార్టీకి చేదు అనుభవాన్ని మిగిల్చి, చీపురు పార్టీని ఛీ కొట్టారు ఢిల్లీ ప్రజలు ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ వికసిత్ భారత్ నిర్మాణంలో మేము కూడా భాగస్వామ్యులమని కమలానికి జై కొట్టి బిజెపిని పెద్దఎత్తున గెలిపించారని వారు తెలియజేశారు, అనంతరం వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ నిర్మాణంలో భాగంగా ఢిల్లీ ప్రజలు సరైన తీర్పునిచ్చారని దేశం నరేంద్ర మోడీ గారి చేతుల్లో సుభిక్షంగా సురక్షితంగా ఉంటుందని అక్కడి ప్రజలు నమ్మారని అదే విధంగా ఆ యుగపురుషుని అడుగుజాడల్లో మేము సైతం అంటూ ఢిల్లీ ప్రజలు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సురేందర్ రెడ్డి రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకులు శ్రీనివాస్ గౌడ్, నాగరాజు, డివిజన్ అధ్యక్షులు డాక్టర్ కిరణ్, గురు ప్రసాద్, బిజెపి సీనియర్ నాయకులు పిట్ల మనోహర్, ఆకుల రాము, నర్సింగ్, కృష్ణప్రియ, శ్రీనివాస్, పండుగ రేణుక, శ్రీలత, దుర్గాప్రసాద్ రావు, చంద్రప్రకాష్ రెడ్డి, వీరన్ కుమార్, సంతోష్ గుప్తా, విశాల్, ఫణి, బాల కుమార్, భరత్, వినయ్, అనిల్ యాదవ్, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.