*పాకిస్తాన్ దేశవాసులను భారతదేశ నుండి పంపించాలని తాసిల్దార్ కు వినతి పత్రం అందించిన బిజెపి శ్రేణులు*
*ఇల్లందకుంట మే 6 ప్రశ్న ఆయుధం*
వీసా పైన వచ్చిన పాకిస్తాన్ దేశవాసులను గుర్తించి భారతదేశం నుండి పంపించాలని ఇల్లందకుంట మండల తాసిల్దార్ కు బిజెపి మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి బిజెపి శ్రేణుల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు అందుబాటులో తాసిల్దార్ లేకపోవడంతో వినతి పత్రాన్ని మండల డిప్యూటీ తాసిల్దార్ కు అందజేశారు అనంతరం బిజెపి మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి విసిటింగ్ వీసా పై ఆరోగ్య వీసా పైన వచ్చిన పాకిస్తాన్ దేశవాసులను ప్రభుత్వం గుర్తించి వారిని భారతదేశం నుండి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు
తెలంగాణలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీ దేశవాసులను బహిష్కరించినందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ఆశ్రమం పొందిన ఉగ్రవాదులు 2025 ఏప్రిల్ 22 న కాశ్మీర్ లోని పహాల్గామ్ ప్రాంతంలో క్రూరమైన దాడికి పాల్పడడంతో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు పోయాయని దారుణ ఘటన దేశవ్యాప్తంగా అందరిని కల్చి వేసిందని ఐ ఎస్ ఐ కి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒప్పందం ఉందని ఈ దుశ్చర్య రీత్యా పాకిస్తాన్ తో భారత్ కు ఉన్న అన్ని ఒప్పందాలను రద్దు చేసుకున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించిందని భారతదేశంలో ఏ ఒక్క పాకిస్తాన్ పౌరుడు నివసించడానికి వీల్లేదని వెంటనే దేశం విడిచి వెళ్లాలని భారత్ ప్రభుత్వం ఇప్పటికే కోరడం జరిగిందని తెలిపారు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న చెల్లుబాటు అయ్యే పత్రాలు లేని గడువు ముగిసిన వీసాలు కలిగి ఉన్న వారు, వీసాలు సస్పెండ్ చేయబడిన పాకిస్తాన్ దేశీయులు అందరినీ వెంటనే గుర్తించి పంపించాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్థానిక పరిపాలన శాఖ వేగంగా తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో గుత్తికొండ రాంబాబు, అబ్బిడి తిరుపతి రెడ్డి, తడిగోప్పుల రమేష్,నల్ల లింగారెడ్డి, తాళ్ల లావణ్య,రావుల విజయ్ బాబు, మురహరి గోపాల్, మురహరి శంకర్,మట్ట పవన్ రెడ్డి, కొక్కుల దేవేందర్, చదువు సాయిరెడ్డి, వలసాని సునీల్, ఇంగిలే రమేష్, జోడు సంపత్, ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, గురుకుంట్ల అనిల్, రావుల అశోక్ తదితర బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు