ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్ఫూర్తితో ముందుకు సాగాలి: బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్

మెదక్, అక్టోబర్ 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): దేశ ఐక్యతకు ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆశయాలను కొనసాగించాలని, ఉక్కు మనిషి స్ఫూర్తితో ముందుకు సాగాలని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా మెదక్ స్వాగతం బోర్డు నుండి రాందాస్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్ మాట్లాడుతూ. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ చరిత్రలో మహానుభావులైన నేతల సేవలను ప్రపంచానికి పరిచయం చేయాలనే మహత్తర ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ఆ కార్యక్రమాలలో భాగంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణకు నిజమైన స్వతంత్రం రావడానికి సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలోను అమలు చేసి ప్రజలకు స్వేచ్ఛను అందించారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. సర్దార్ పటేల్ విగ్రహ నిర్మాణం మన దేశ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, జనగామ ప్రబారి నందారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, రాజేందర్, జిల్లా కార్యదర్శి బాదే బాలరాజు, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి, విజయ్ కుమార్, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు సతీష్, సోషల్ మీడియా కన్వీనర్ సంగీత, నాయకులు శ్రీనివాస్ గౌడ్, లోకేష్, ముక్క సుధాకర్, వేణు, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ సాయి కంచం కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment