మెదక్/నర్సాపూర్, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లని జీవోలతో బీసీలను మోసం చేసిందని, గ్రామాలు అభివృద్ధి లేక నిలిచిపోయాయి సర్పంచ్ వ్యవస్థ పునరుద్ధరించాలని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం నర్సాపూర్ అసెంబ్లీ కార్యాలయంలో రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ పై విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ పేరుతో చెల్లని జీవోలు తీసుకువచ్చి, ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నిస్తోందని, బీసీలను మోసం చేసి, వారి ఓట్లను దండుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అలాగే, నిన్న హైకోర్టు జీవో నెంబర్ 9 పై స్టే విధించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని, చట్టపరమైన మార్గంలో కాకుండా చెల్లని జీవో తీసుకురావడం వలన ఈరోజు బీసీలు న్యాయంగా రావాల్సిన వాటిని కోల్పోతున్నారని పేర్కొన్నారు. కోర్టులో నిలవదని తెలిసీ చెల్లని జీవోతో కోటా చెలగాటం ఆడిందని,. ఇది బీసీల ఓట్ల కోసం వేసిన రాజకీయ నాటకం మాత్రమే అని అన్నారు. సంక్షేమం కోసం చేసిన ప్రయత్నం కాదని, ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42శాతం రిజర్వేషన్లపైనా హైడ్రామా చేసిందని విమర్శించారు. గ్రామాలలో సర్పంచ్ వ్యవస్థ లేక గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేక పోతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కూడా భయపడే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, ప్రజలకు సమాధానం చెప్పలేక డ్రామాలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి, జిల్లా కార్యదర్శి బాదే బాలరాజు, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు గుండం శంకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సంగసాని రాజు, రామ్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
చెల్లని జీవోలతో బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్
Oplus_131072