Headlines
-
నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సోనియామ్మ జన్మదినం ఉత్సవాలపై బిజెపి వ్యతిరేకం
-
తెలంగాణ తల్లి ఉత్సవాలు: బిజెపి ఎంపికను ఖండించిన ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
-
నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన రోజు సెప్టెంబర్ 17ని అధికారికంగా జరపాలని డిమాండ్
-
కాంగ్రెస్ హామీల అమలు చేయాలని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రభుత్వంపై మండిపాటు
-
సోనియామ్మ జన్మదినం సందర్భంగా తెలంగాణ తల్లి ఉత్సవాలు జరపడం వ్యతిరేకం: బిజెపి
నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ డిసెంబర్ 09:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోనియామ్మ జన్మదినం రోజున ప్రతి సంవత్సరం తెలంగాణ తల్లి ఉత్సవాలు జరపాలన్న ప్రతిపాదన పై నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతు… సోనియామ్మ జన్మదినం రోజున తెలంగాణ తల్లి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరపాలి అనేది బిజెపి తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.
ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ బలిదేవత సోనియామ్మ, అన్న ఆయన నేడు ఇటలీ రాణి సోనియామ్మ మెప్పు కోసం ఆమె జన్మదినన్ని తెలంగాణ తల్లి ఉత్సవాలుగా జరుపడాన్ని పూర్తిగా వ్యతిరేకస్తున్నాం అని అన్నారు
సోనియా జన్మదిననా తెలంగాణ తల్లి ఉత్సవాలు జరిపితే తెలంగాణ కోసం అసువులు బాసిన అమరవీరుల ఆత్మలు గోషిస్తాయి అని తెలిపారు. నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందిన రోజు సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాకపోవడం పై ఉన్న మతలబ్ ఎంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
తెలంగాణ విగ్రహం మార్పులో తెలంగాణ ఆస్తిత్వం, తెలంగాణకి ప్రతీక అయినా బతుకమ్మ పెట్టకపోవడం తెలంగాణను అవమానించినట్లే అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారంలో ఉన్న శ్రద్ద తెలంగాణ ప్రజలపైన లేదని, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల మెప్పును పొందడంలోనే సంవత్సర కాలం గడిచిపోయిందని ఏద్దేవా చేసారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు, హామీలు ఎగవేయడానికే సర్వే పేరుతో, ఉత్సవాల పేరుతో కాలయాపన చేస్తుందని దీనిని పూర్తిగా ఖండిస్తున్నాం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన గ్యారంటీల అమలుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలనీ డిమాండ్ చేసారు.