“స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయానికి సంస్థాగత బలం కీలకం”
“కామారెడ్డిలో బీజేపీ నాయకులకు కార్యవర్గ సమావేశం – స్థానిక ఎన్నికల పోరాటం”
-బూత్ అద్యక్షుడి నుండి జిల్లా స్థాయి నాయకుల వరకు అందరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలి
-నియోజకవర్గంలో వార్డు సభ్యుడి నుండి జెడ్పి ఛైర్మెన్ వరకు అన్ని బీజేపీ నాయకులే గెలవాలి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 03:
కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో కామారెడ్డి, రాజంపేట మండలాల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంకా వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, సంస్థాగతంగా బలంగా ఉంటేనే రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలవగలం అని అన్నారు. ప్రతి బీజేపీ నాయకుడు బూత్ అద్యక్షుడి నుండి జిల్లా స్థాయి నాయకుల వరకు అందరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనీ అన్నారు. నియోజకవర్గంలో వార్డు సభ్యుడి సర్పంచ్, ఉపసర్పంచ్, ఎంపీటీసీ జెడ్పీటీసీ జెడ్పి ఛైర్మెన్ వరకు అన్ని బీజేపీ నాయకులే గెలవాలనీ అందుకు ఇప్పటి నుండి ప్రతి బీజేపీ కార్యకర్త క్షేత్ర స్థాయిలో పని చేయాలనీ అన్నారు.కార్యక్రమం అనంతరం కామారెడ్డి, రాజంపేట మండలాలకు చెందిన 22 మంది నాయకులకు బీజేపీ క్రియాశీల సభ్యత్వం కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అందజేయటం జరిగింది.