బిజెపి అధ్యక్షుడు పెద్దిడ్ల నర్సింలు ఇల్లుని కక్షపూరితంగా కూల్చివేత
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి
(ప్రశ్న ఆయుధం) జులై 8
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మల్కాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు *పెద్దేడ్లనర్సింలు*ఇల్లుని కక్షపూరితంగా, ఇల్లుకు సంబంధించిన అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నప్పటికీ సంబంధిత, అధికారుల వద్ద తన ఇల్లు నిర్మాణం కొరకు పరిమిషన్ తీసుకున్నప్పటికీ ఇల్లు నిర్మాణం కాస్త ఆలస్యం కావడంతో, ఆ యొక్క పత్రాలు రెన్యువల్ చేసుకోకపోవడంతో, అధికారులు, పోలీసు బలగాలతో, వచ్చి కూల్చివేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర నాయకులు, *పైడి ఎల్లారెడ్డి* మాజీ ఎమ్మెల్సీ *జనార్దన్ రెడ్డి* జిల్లా అధ్యక్షులు *నీలంచిన్నరాజులు* రాష్ట్ర నాయకులు మర్రి బాలకిషన్, అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, మాజీ ఎంపీపీ నక్క గంగాధర్, ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షులు రాజేష్, జనరల్ సెక్రెటరీ, శంకర్ ,శ్రీను ఉపాధ్యక్షులు కాశీనాథ్ , పండరి, సెక్రటరీలు, శివ ,గజానంద్ మహిళా మోర్చా అధ్యక్షురాలు, సుజాత, మండల జనరల్ సెక్రెటరీ మహేందర్, సీనియర్ నాయకులు SN రెడ్డి, నరేష్, పికె కిష్టయ్య, సాయి రెడ్డి, లక్ష్మారెడ్డి, లింగంపేట్ మండల అధ్యక్షులు క్రాంతి కుమార్, తాడ్వాయి మండలం అద్యక్షులు సంతోష్ రెడ్డి, నాగిరెడ్డి పేట్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, ఎల్లారెడ్డి మండల పార్టీ కార్యకర్తలు పదాధికారులందరూ, వివిధ మోర్చాలా అధ్యక్షులు, కార్యకర్తకు, అండగా పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని, న్యాయపరమైన పోరాటానికి పార్టీ అండగా నిలుస్తుందని, నరసింహులుకి, వారి కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది, అనంతరం వారిని ఆర్థిక సహాయంగా , *పైడిఎల్లారెడ్డి* *ఒక లక్ష రూపాయలు* ఆర్థిక సహాయం చేసి, వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని, హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షులు, అందరూ మీడియా మిత్రులతో, తదుపరి ప్రణాళిక గురించి అలాగే కార్యకర్తలను ఉద్దేశించి,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కొంత మంది నాయకులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు,కి హెచ్చరించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎవరు కూడా అధైర్య పడద్దని, నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ఇతర పార్టీల నాయకుల వల్ల నష్టం జరగకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు అండగా ఉంటారని కార్యకర్తలకు ధైర్యం చెప్పడం జరిగింది.