సంస్కృతి సంప్రదాయాల రక్షణ బిజెపి

*సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలంటే బిజెపి కావాలి*

*బిజెపి సభ్యత్వ నమోదు ను వేగవంతం చేయండి*

*జిల్లా అధికార ప్రతినిధి అలివేలి సమ్మిరెడ్డి*

*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో సెప్టెంబర్ 12*

దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడే పార్టీ బిజెపి అని గ్రామాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు ను వేగవంతం చేయాలని జిల్లా అధికార ప్రతినిధి అలివేలి సమ్మిరెడ్డి కార్యకర్తలు కోరారు సభ్యత్వ నమోదు మండల స్థాయి కార్యక్రమాన్ని గురువారం తిమ్మాపూర్ మండల కేంద్రం లో ప్రారంభించారు. ఈ సందర్బంగా హాజరైన సమ్మిరెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో ప్రతీ గ్రామం నుండి ఎంతో మంది బీజేపీ ని ఆదరించారని వారందరికీ సభ్యత్వం ఇచ్చేలా ప్రయత్నం చేయాలని కోరారు. గ్రామానికి ఇద్దరి చొప్పున నియామకమైన ఇంచార్జి లు బూత్ ల వారిగా సభ్యత్వం పై దృష్టి సారించాలని తెలిపారు.రాష్ట్ర స్థాయి నుండి బూత్ స్థాయి కార్యకర్తలందరూ సభ్యత్వం చేసుకోవాలని సూచించారు. 8800002024 ఫోన్ నంబర్ ద్వారా గానీ, నమో ఆప్ ద్వారా గానీ, స్కానర్ ద్వారా గానీ సభ్యత్వం తీసుకోవచ్చని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర,జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల శ్రీనివాస్,సభ్యత్వ నమోదు ఇంచార్జి లు కిన్నెర అనిల్, గడ్డం అరుణ్, మండల ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల తిరుపతి రెడ్డి,చింతం వరలక్ష్మి, వేల్పుల రవీందర్ యాదవ్,వేల్పుల ఓదయ్య, కంది రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now