Headlines
-
కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలు: బీజేపీ నిరసన పాదయాత్ర
-
కూకట్‌పల్లి బీజేపీ సమావేశం: వడ్డేపల్లి రాజేశ్వరరావు వ్యాఖ్యలు
-
ప్రజలకు మోసం చేసిన కాంగ్రెస్ హామీలు – బీజేపీ ఆగ్రహం
-
డిసెంబర్ 1 నుండి 5 వరకు బీజేపీ పాదయాత్ర
-
ప్రజల తీర్పుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని బీజేపీ నేతల పిలుపు
దుయ్యబట్టిన వడ్డేపల్లి రాజేశ్వరరావు
ప్రశ్న ఆయుధం నవంబర్ 24: కూకట్‌పల్లి ప్రతినిధి
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట తప్పి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలోని వారి వైఫల్యాలను నిరసిస్తూ రాష్ట్ర బీజేపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు డిసెంబర్ 1’వ నుంచి 5’వ తేదీ వరకు చేపట్టవలసిన పాదయాత్రయొక్క సన్నహ సమావేశం, కూకట్ పల్లీ నియోజకవర్గ యాత్ర ప్రాముఖ్ వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కూకట్ పల్లీ బిజెపి కార్యాలయం నందు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ జిల్లా యాత్ర ప్రాముఖ్ అర్శనపల్లి సూర్యరావు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయినేని సూర్యప్రకాష్ రావు విచ్చేశారు, ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని దిగ్విజయంగా నిరసన యాత్ర విజయవంతం చేయాలని సమావేశానికి విచ్చేసినటువంటి కార్యకర్తలను ఉద్దేశించి నాయకులు వారి సూచనలను తెలియజేశారు, అనంతరం వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవాలకు సిద్ధం కావడం విడ్డూరంగా ఉందని, మహారాష్ట్ర ఎన్నికల్లో మరాఠా ప్రజలు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇకనైనా తన వైఖరిని మార్చుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, లేకుంటే కచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని రాజేశ్వర్ రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, జిల్లా ఎన్నికల సహాయ అధికారి శ్రీధర్, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శంకర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు, మూసాపేట్ డివిజన్ కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్, కూకట్ పల్లి నియోజకవర్గం బిజెపి నాయకులు – కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.