ఐలమ్మకు ఘన నివాళులు అర్పించిన బిజెపి శ్రేణులు
కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో
చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం రోజున కరీంనగర్ బిజెపి శ్రేణులు పట్టణంలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు కార్యక్రమానికి హాజరైన బిజెపి సీనియర్ నాయకులు కొట్టే మురళీకృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ ఉప్పరపల్లి శ్రీనివాస్ లు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని దొరలు, దేశ్‌ముఖ్‌లు, రజాకార్లను గడగడ లాడించిన వీరనారి ఐలమ్మ అని కొనియాడారు చాకలి ఐలమ్మ స్ఫూర్తినీ ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బాన్‌చెన్ కాల్మొక్త దొర అనే వారితో బందూకులు పట్టించిన వీరచరిత్ర ఐలమ్మ దని, ఆమె చూపిన తెగువ స్త్రీ జాతికి స్ఫూర్తిదాయకమన్నారు. ఐలమ్మ నివాళులర్పించారు నాటి తరం ఐలమ్మ త్యాగాలు, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి తరాలకు తెలియజేయడానికి పాఠ్యపుస్తకాలలో చేర్చాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బండ రమణారెడ్డి నాగసముద్రం ప్రవీణ్ కుమార్, కరండ్ల మధుకర్ ఏన్నం ప్రకాష్ గుండారపు సంపత్ పొన్నాల రాము ఇసపెల్లి మహేష్ కొల్లూరి రాజు, కొత్తకొండ వెంకట సాయి, తుర్తి శ్రీనివాస్ చిక్కులకిరణ్, భరత్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు..