– ఉత్తర తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్
– విద్యాసంస్థలను గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ లకు తరలిస్తున్న ప్రధాని మోడీ
– ఏడాదిలోనే…55 వేల ఉద్యోగాలిచ్చిన ఘనత కాంగ్రెస్ సర్కార్
– గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి బాటలు
– కాంగ్రెస్ ఎన్నికల ఇన్చార్జి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
గజ్వేల్ నియోజకవర్గం, 19 ఫిబ్రవరి 2025 : ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రెండు కోట్ల ఉద్యోగాల కల్పన హామీగానే నిలిచిపోగా, ఉత్తర తెలంగాణను కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్లక్ష్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వ రంగ, విద్యా రంగ సంస్థలను గుజరాత్, ఉత్తరప్రదేశ్ లకు తరలిస్తుందని గ్రాడ్యుయేట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, సమన్వయకర్త గుత్తా అమిత్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ విమర్శించారు. బుధవారం గజ్వేల్ నియోజకవర్గ స్థాయి సన్నాహక, ఆత్మీయ సమావేశం డిసిసి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించి సమస్యల పరిష్కారానికి బాటలు వేయాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున నిరుద్యోగులు, యువత, ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం సులువుగా జరుగుతుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మేధావి వర్గానికి చెందిన వారిని ఒప్పించి ఓటు వేయించుకునే బాధ్యత తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందాలతో ముందుకెళ్తుండగా, ఇందుకు బిఆర్ఎస్ తమ అభ్యర్థిని నిలపకపోవడం నిదర్శనమని, ఈ విషయం పై వారిని చైతన్యం చేయాలని అన్నారు. దేశాన్ని అప్పుల పాలు చేస్తూ కులం, మతం, ప్రాంతం, వర్గాల పేరిట విడదీస్తూ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్న బిజెపికి తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. చారిత్రాత్మక, సాహసోపేత నిర్ణయాలతో సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ చక్కటి ఫలితాలు సాధిస్తున్నట్లు చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన బీసీ, ఎస్సీల అభ్యున్నతికి కృషి చేస్తుండగా, రాష్ట్రంలో చేపట్టిన కుల గణన, ఎస్సీ వర్గీకరణ అమలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు తదితర అంశాలను బిజెపి, బిఆర్ఎస్ జీర్ణించుకోలేక పోతున్నట్లు ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఉపాధి కల్పనలో భాగంగా రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి రూ లక్షా 50 వేల కోట్ల పెట్టుబడులు సాధించగా, ఎన్నో సంస్థలతో ఎంఓయు కుదుర్చుకున్నట్లు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ కు ప్రత్యేకత ఉందని, ఆయనను ఎదుర్కోవడం ఆషామాషీ కాదని పేర్కొంటూ నేరుగా పోరాటం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డికి పార్టీ అండగా ఉండటంతో పాటు వివిధ నామినేటెడ్ పోస్టుల భర్తీ, పెండింగ్ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రాడ్యుయేట్లు, ఉద్యోగ, ఉపాధ్యాయులను నేరుగా కలిసి నరేందర్ రెడ్డికి ఓటు వేసే విధంగా పార్టీ శ్రేణులు దృష్టి పెట్టాలని, ఇందుకోసం ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పంట రుణమాఫీ, రైతు భరోసా, రూ 5 లక్షల వ్యయంతో ఇంటి నిర్మాణం, రేషన్ కార్డులు పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ 500 కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ సరఫరా, రూ 10 లక్షల వరకు కార్పొరేట్ వైద్యం తదితర పథకాల పై ప్రజలను చైతన్యం చేయాలని వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మడుపు భూంరెడ్డి, ఎలక్షన్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఆంక్షా రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు గాడిపల్లి భాస్కర్, కృష్ణ, నాచగిరి మాజీ చైర్మన్లు లక్ష్మా రెడ్డి, మహేందర్ రెడ్డి, మాజీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, మెదక్ ఆర్యవైశ్య సంఘం జిల్లా చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, మాజీ ఎంపీపీ మోహన్, నరేందర్, భాస్కర్ రెడ్డి, ఆయా మండలాల బాధ్యులు, నేతలు శ్రీనివాస్ రెడ్డి, లింగా రావు, సందీప్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కిష్టా గౌడ్, రాములు గౌడ్, సారిక శ్రీనివాస్ రెడ్డి, సమీర్, రమేష్ గౌడ్, సుభాష్ చంద్రబోస్, రేగొండ, బూరెం గణేష్ తదితరులు పాల్గొన్నారు.