స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి
–కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా నూతనంగా నియమించబడిన నీలం చిన్న రాజులు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ మాజీ అధ్యక్షురాలు అరుణా తార నుండి నీలం చిన్న రాజులు జిల్లా అధ్యక్ష బాధ్యతను స్వీకరించారు. అనంతరం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల్లో బీజేపీ సత్తా చాటాలనీ, వార్డు సభ్యులు మొదలుకొని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, కౌన్సిలర్ అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచేల ఇప్పటి నుండే పని చేయాలనీ అన్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలనీ పిలుపునిచ్చారు. పార్టీ లో పని చేసిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందనీ అన్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ విస్తరించి అంతట గెలిచి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీలు బీజేపీ గెలిచేలా ఇప్పటి నుండే ప్రణాళిక సిద్ధం చేయాలనీ అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, బాణాల లక్మారెడ్డి, మాజీ మంత్రి నేరెళ్ళ ఆంజనేయులు, నాయకులు కృష్ణారెడ్డి, రవీందర్ రావు, కిషన్ రావు, విపుల్, రాము వివిధ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.