కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలి: బీజేపీ రాష్ట్ర నాయకులు మురళీధర్ యాదవ్, రమేష్ గౌడ్

మెదక్/నర్సాపూర్, జూలై 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలనిబీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీధర్ యాదవ్, బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం నర్సాపూర్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, అందులో మైనార్టీలకు 10శాతం కేటాయించడాన్ని ప్రశ్నించారు. బీసీలకు పూర్తి స్థాయిలో 42 శాతం ఇచ్చేలా ప్రకటించి, ఆ మొత్తంలో మైనార్టీలకు 10 శాతం కేటాయించడం ఏమిటని అన్నారు. గతంలో హైదరాబాద్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు మైనార్టీల రిజర్వేషన్ పేరుతో బీసీల వాటాను తగ్గించడం దారుణమని తెలిపారు. సామాజిక న్యాయంపై మాటలు చెప్పే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని అన్నారు. బీసీలను మోసం చేసే ప్రయత్నాన్ని తాము సహించబోమని, బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని మురళీధర్ యాదవ్, రమేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోడ రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు బుచ్చేష్ యాదవ్, అసెంబ్లీ కన్వీనర్ రమణారావు, మాజీ కౌన్సిలర్ సంగసాని సురేష్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు పాపగారి నాగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now