లింగంపేట్ మండలంలో పర్యటించిన బిజెపి రాష్ట్ర నాయకులు- పైడి ఎల్లారెడ్డి

లింగంపేట్ మండలంలో పర్యటించిన బిజెపి రాష్ట్ర నాయకులు– పైడి ఎల్లారెడ్డి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి.ప్రశ్నఆయుధం,సెప్టెంబర్-3

ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండలంలో పలు గ్రామాల్లో అకాల వర్షాల కారణంగా. పంటలు మరియు ఆర్థికంగా నష్టపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి. అలాగే వారు మాట్లాడుతూ ప్రభుత్వం వీటిపై వీలైనంత త్వరలో పంటలకు నష్టపరిహారం అందించాలని మరియు ఇల్లులు కోల్పోయిన వాళ్లకి ఇంద్రమ్మ ఇల్లు భాగంగా తక్షణమే ఇండ్లను సాంక్షన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, అసెంబ్లీ కన్వీనర్ లింగ రావు, లింగంపేట్ మండల అధ్యక్షులు బొల్లారం క్రాంతి కుమార్, సదాశివనగర్ మండల అధ్యక్షులు కుంట రాంరెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment