విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం..
సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని BJP మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తేఉపేక్షించేది లేదన్నారు. దాడిచేసిన వారిపై కఠినచర్యలుతీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులు,శక్తులపట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే జరిగే పరిణామాలకు రేవంత్ ప్రభుత్వమే బాధ్యతవహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.