బిజెపి, టిఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పై కువిమర్శలు

బిజెపి, టిఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పై కువిమర్శలు

ప్రశ్న ఆయుధం జులై28: కూకట్‌పల్లి ప్రతినిధి

బిజెపి టిఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పై కువిమర్శలు చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ పేర్కొన్నారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తమ పాలనలోని తప్పులను తన చేతగానితనాన్ని ప్రస్తుత ప్రభుత్వంపై వేయాలని చూస్తున్నారన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుoగుబాటుకు పగుళ్లకు కాంగ్రెస్ నాయకులే కారణం అంటూ కేటీఆర్ చేసిన విమర్శలను రమేష్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని నువ్వు నడుపుతూ కూడామేడిగడ్డ కుంగుబాటుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా రెండేళ్ల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై నెపం వేయాలని చూడడం నీ చేతగానితనానికి నిదర్శనం అన్నారు మేడిగడ్డ విషయంలో కేటీఆర్ మతి ఉండే మాట్లాడుతున్నారా అంటూ రమేష్ ప్రశ్నించారు అదేవిధంగా కేటీఆర్ ఇటీవల భాజపా నాయకుడు సీఎం రమేష్ వద్ద ఓ సామాజిక వర్గం పై బూతులు మాట్లాడుతూ విమర్శించడాన్నిఅయన సోమవారం కూకట్పల్లి నియోజకవర్గం పార్టీ కార్యాలయం హేమ దుర్గ భవన్ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు రాజకీయ అవసరాల కోసం వాడుకున్నన్నాళ్లు వాడుకొని ఇప్పుడు ఆ సామాజిక వర్గాన్ని విమర్శించడాన్నిఆయన తప్పు పట్టారు బీసీల అభివృద్ధికి 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు ఆమోదం కోసం పంపించిందన్నారు అయితే ఈ విషయంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఆదరణ పెరుగుతుందోనని భావించిన భాజపా నాయకులు బీసీ రిజర్వేషన్లు పై కూడా విమర్శలకు దిగటం వారి అజ్ఞానానికి నిదర్శనంగానిలుస్తుంది అన్నారు కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ సైతం తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారన్నారు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ముస్లిమ్స్ కు లబ్ధి చేకూరుతుందని చెప్పడాన్నితిరస్కరించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేయాలని చూస్తుందన్నభాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు మాటలను బండిరమేష్ ఖండించారు యూరియా బ్లాక్ మార్కెటింగ్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనీయదని అదే జరిగితే దోషులపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు రాష్ట్రంలోని రైతులందరికీ యూరియాను అందుబాటులో ఉంచుతుందని రమేష్ పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now