ఒకే దేశం ఒకే ఎన్నిక అంటున్న బీజేపీ ఒకే కులం కు ఓకే నా

● రాజ్యాంగాన్ని మార్చే మోదీ ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టండి

● కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు

సిద్దిపేట అక్టోబర్ 28 ప్రశ్న ఆయుధం :

దేశంలో నేడు బిజెపి ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో దేశ ప్రజలను నిరంకుశ పాలన వైపు తీసుకెళ్తుంది అని, దేశ ప్రజల సమైక్యతకు కావలసింది వన్ క్యాస్ట్ వన్ నేషన్ అని, భారత రాజ్యాంగానికి మతోన్మాద శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని, రాజ్యాంగ రక్షణకు యువతరం నడుం బిగించాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం సిద్దిపేట లో స్థానిక కెవిపిఎస్ జిల్లా ఆఫీసులో మరాటి కృష్ణ మూర్తి అద్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 110 దేశాల రాజ్యాంగాల ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి విభిన్న వైవిధ్యాలు కలిగిన దేశంలో దేశ ప్రజలందరినీ ఒకే తాటి పైన నిలబెట్టడానికి, కులం మతం భాషా ప్రాంతం అతీతంగా ప్రజలందరికీ సమాన హక్కులు ఉండే విధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారని ఆయన చెప్పారు. ప్రాచీన మనువాద సంస్కృతి సైద్ధాంతిక భూమిక కలిగి ఉన్న ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోని బిజెపి ఆ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి అంబేద్కర్ ఆలోచనలను తుద ముట్టించడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తుందని సామాజిక శక్తులు అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. చట్టం ముందు అందరూ సమానులే నని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 పేర్కొంటుందని చెప్పారు. భారత రాజ్యాంగం భారతీయులందరికీ అర్థమయ్యే రోజు రావాలన్నారు. కేవలం న్యాయ శాస్త్ర విద్యార్థులు న్యాయవాదులకు మాత్రమే రాజ్యాంగం అర్థం కావడం ద్వారా దేశ ప్రజలందరూ మత చాందస మూఢవిశ్వాసాల మాటల జీవించాల్సి వస్తుందన్నారు మత రాజ్యాలన్నీ చీకటి రాజ్యాలు అయితే భారత రాజ్యాంగం సర్వసత్తాక గణతంత్ర సామ్యవాద సోషలిస్టు భావాలను సంతరించుకుందని చెప్పారు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తున్న ఆర్ఎస్ఎస్ బిజెపి అట్టడుగు వర్గాల హక్కులను కాలరాస్తుందన్నారు. ప్రశ్నిస్తే నేరంగా భావిస్తున్న రోజులని ప్రశ్నించిన మేధావులైన దబెల్కర్ ఫన్సారే కల్బుర్గి గౌరీ లంకేష్ వంటి మేధావులను 10 ఏళ్ల కాలంలో సంఘ్ పరివార శక్తులు పొట్టలు పెట్టుకున్నాయని చెప్పారు. మతాన్ని దేవుని రాజకీయాలతో నిలితం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా బిజెపి ఎంఐఎం పబ్బం గడుపుకుంటున్నాయని తద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు దేశ సమైక్యత సమగ్రతల కోసం లౌకిక విలువల కోసం నేటి యువతరం కట్టుబడి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు రాజ్యాంగం మౌలిక పునాదులుగా ఉన్న ప్రజాస్వామ్యం ఫెడరలిజం సామాజిక న్యాయం లౌకికత్వం నాలుగు మూల స్తంభాలను కాపాడుకోవాలని అన్నారు. చరిత్ర పాఠ్యాంశాలలో భగత్ సింగ్ అంబేద్కర్ వంటి మహనీయుల చరిత్రలను చెడిపేసే విధంగా ఎన్సీఈఆర్టీ నుంచి తొలగిస్తుందన్నారు. ప్రస్తుత దేశానికి మతోన్మాద గండం పొంచి ఉందని రాజ్యసభ స్థానాలలో రిజర్వేషన్ల తో పాటు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని తద్వారా సామాజిక న్యాయానికి బాట వేయాలని కోరారు ఎస్సీల లో క్రిమిలేయర్ పెట్టాలనే వాదనను ఆయన తిప్పి కొట్టారు. అట్టడుగు తరగతుల అభివృద్ధి ఉత్పత్తి శక్తుల శ్రమ సంస్కృతికి విద్యార్థి యువతరం కట్టుబడి ఉండాలని శ్రమను గౌరవించడమే దేశభక్తి అని ఆయన పిలుపునిచ్చారు అసమానతల సమాజాన్ని అంతం చేయడం ద్వారా రాజ్యాంగ యొక్క ఉన్నత్యాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు బక్కిలి బాలకిషన్, కాముని గోపాలస్వామి, ఉపాధ్యక్షులు ముత్యాల ప్రభాకర్, మరాటి కృష్ణమూర్తి, దర్శనం రమేష్, కర్రోల్ల ఎల్లం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment