గాంధీజి ఆశయాల సాధన కోసం బీజేపీ ముందుకు వెళ్తుంది

గాంధీజి ఆశయాల సాధన కోసం బీజేపీ ముందుకు వెళ్తుంది

ఆ మహనీయుని జయంతి సందర్భంగా సేవా పక్షోత్సవం

– స్వచ్చ భారత్ ఉద్దేశం నాయకులు రోడ్లు ఊడ్చడం కాదు, ప్రజలకు అవగాహన కల్పించడం

కేంద్ర మంత్రి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రి ప్రహ్లాద్ జోషి

ప్రశ్న ఆయుధం న్యూస్, అక్టోబర్ 01, కామారెడ్డి :

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పర్యటనకు విచ్చేసిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అందులో భాగంగా కామారెడ్డి కొత్త బస్ స్టాండు ఆవరణలో స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గాంధీజి ఆశయాల సాధన కోసం బీజేపీ ముందుకు వెళుతుందని అందులో భాగంగా ఆయన కలలు కన్న భారత్ కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ఆ మహనీయుని జయంతి సందర్భంగా సేవా పక్షోత్సవం పేరిట సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. స్వచ్చ భారత్ ఉద్దేశం నాయకులు రోడ్లు ఊడ్చడం మాత్రమే కాదు ప్రజలకు అవగాహన కల్పించడం అని, ప్రజలు కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన చెత్త బట్టల్లో చెత్త వేస్తే ఎవరికి ఇబ్బంది కలగదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now